ఫిఫా వరల్డ్ కప్ బహుమతి మొత్తం పెంపు
వచ్చే ఏడాది బ్రెజిల్ లో జరగనున్న ఫుట్ బాల్ వరల్డ్ కప్ విజేతలకు సుమారుగా 200 కోట్ల రూపాయల భారీ బహుమానం లభించనుంది. నగదు బహుమానాన్ని ఒక వంతు పెంచనున్నట్లు ఫిఫా జనరల్ సెక్రటరీ జెరోమ్ వాల్కే తెలిపారు. టోర్నమెంటులో మొత్తం నగదు బహుమతిని 3,642కోట్లకు పెంచుతున్నట్లు చెప్పారు. 2010లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో నగదు బహుమతి 2,604కోట్లుగా ఉంది. బుధవారం జరగనున్న ఫైనాన్స్ కమిటీ ఆమోదం తర్వాత దీన్ని ధ్రువీకరిస్తామని జెరోమ్ చెప్పారు.